తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్ క్షమాపణలు చెప్పడంపై సీనియర్ నేత విహెచ్ హాట్ కామెంట్స్ చేసారు. రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పారు కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆలోచనలు చేయాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరు బయటకు వెళ్లకుండా ఒక సీనియర్ నాయకుడిగా నేను ఆపే ప్రయత్నం చేస్తానని స్పష్టం చేశారు. ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకి అన్యాయం జరగకూడదు…నేను కోమటిరెడ్డి తో మాట్లాడతాననీ వి హనుమంతరావు తెలిపారు. పిఎసి సమావేశంలో పార్టీ అంతర్గత విషయాలు చర్చిస్తానని వెల్లడించారు హనుమంత రావు.
కాగా రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పిన విషయం నా దృష్టికి రాలేదను. నేను చూడలేదు, వినలేదు.. నాపైన వాడరాని పదం వాడిన వారిని సస్పెండ్ చేయాల్సిందే.. పాదయాత్రలో పాల్గొనే ఆలోచన లేదు అన్నారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.