ఎంవీఎస్ మూర్తికి క‌న్నీటి వీడ్కోలు..

-


ఉప‌రాష్ట్రప‌తి, సీఎంతో స‌హా ప‌లువురు నివాళులు
అమ‌రావ‌తి (విశాఖపట్నం): ఎంవీవీఎస్‌ మూర్తి అకాల మృతితో విశాఖ పెద్దదిక్కును కోల్పోయిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం విశాఖ చేరుకున్న ఆయన ఎంవీఎస్ మూర్తి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎంవీవీఎస్‌ మూర్తి వ్యాపారవేత్తగా, విద్యావేత్తగా ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలు నిర్వహించారని కొనియాడారు. పది మందికి ఉపయోగపడేలా జీవితాన్ని మలుచుకున్నారన్నారు. ఉన్నత ప్రమాణాలతో గీతం విద్యా సంస్థను నెలకొల్పి ప్రపంచస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

ఎంవీవీఎస్‌ మూర్తి రాజకీయాలకే వన్నె తెచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన వ్యక్తి కాదని.. వ్యవస్థ అని కొనియాడారు. విశాఖలో మూర్తి భౌతికకాయానికి చంద్ర‌బాబు నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. అల‌స్కాలో జరిగిన రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెంది ఈ ఉద‌యం విశాఖ‌ చేరుకున్న మూర్తి భౌతికకాయానికి పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు నివాళులర్పించారు. సిరిపురంలోని ఆయన నివాసంలో మంత్రులు నారా లోకేశ్‌, అయ్యన్నపాత్రుడు, ప్రత్తిపాటి పుల్లారావు, భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, లోకేశ్ భార్య‌ నారా బ్రాహ్మణి, బాలకృష్ణ భార్య‌ వసుంధర, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌ తదితరులు నివాళులర్పించారు. రుషికొండ గీతం క్యాంప‌స్ స‌మీపంలో ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో మూర్తి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు.

Read more RELATED
Recommended to you

Latest news