ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కొత్త కేబినెట్ ను కాసేపటి క్రితం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త కేబినెట్ లో పలువురు కొత్త వ్యక్తులు వచ్చారు. అందులో భాగంగా చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజిని కూడా జగన్ కొత్త కేబినెట్ లో స్థానం దక్కించుకుంది. కేవలం ఒక్క సారి మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచిన విడదల రజినికి మంత్రి పదవి దక్కింది. 2019 లో విడదల రజిని.. చిలకలూరి పేట నుంచి పోటీ చేసి టీడీపీ సీనియర్ నాయకులు ప్రత్తిపాటి పుల్లారావును ఓడించింది.
రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రత్తిపాటి పుల్లారావును ఓడించిన విడదల రజిని అప్పట్లో వార్తల్లోకి ఎక్కారు. తొలి కేబినెట్ లో స్థానం దక్కకపోగా.. రెండో విడతలో రజినికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. తనకు మంత్రి పదవి దక్కడంపై విడదల రజిని స్పందించారు. మీడియా ముందు భావోద్వేగం అయ్యారు. తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచిన తనకు మంత్రి పదవి ఇవ్వడం అంటే.. తనపై ఉన్న నమ్మకమనే అన్నారు. తనపై ఉన్న నమ్మకాన్ని తప్పకుండా.. నిలబెట్టుకుంటానని అన్నారు. అలాగే తనకు మంత్రి పదవి వస్తుందని కలలో కూడా అనుకోలేదంటూ భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు.