ఆస్ట్రేలియాలో నిర్వహించే బిగ్ బాష్ లీగ్ అంటేనే ఒక సంచలనం. ఆటగాళ్ళలో ఉన్న కొత్త ప్రతిభ అనేది ఈ టోర్నీ ద్వారా బయటకు వస్తు ఉంటుంది. ముఖ్యంగా ఫీల్డింగ్ లో, బ్యాటింగ్ లో అయితే ఏదోక సంచలనం నమోదు అవుతూనే ఉంటుంది. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా బిగ్ బాష్ లీగ్ లో ఒక షాట్ క్రికెట్ ప్రపంచాన్ని విశేషంగా ఆకట్టుకుంది.
పెర్త్ స్కోర్చర్స్ వర్సెస్ హోబర్ట్ హరికేన్స్పై జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా క్రికెటర్, పెర్త్ బ్యాట్స్మెన్ జోష్ ఇంగ్లిస్ కేవలం 46 బంతుల్లో 73 పరుగులు చేసి జట్టుని ఆదుకున్నాడు. వీటిల్లో నాలుగు సిక్సులు కూడా ఉన్నాయి. వాటిలో ఒక సిక్స్ కామెంటరీ బాక్స్ లో ఉన్న రికి పాంటింగ్ ని కూడా విశేషంగా ఆకట్టుకుంది. న్యూజిలాండ్ మాజీ బ్యాట్స్మెన్ బ్రెండన్ మెక్కల్లమ్తో మాదిరిగానే సిక్స్ కొట్టాడు.
పక్కకు జరిగి బంతిని కీపర్ మీదుగా వెనక్కు సిక్సు కొట్టాడు. గతంలో బ్రెండన్ కూడా ఇదే విధంగా సిక్స్ కొట్టాడు, దీనితో అతన్ని ఇంగ్లిస్ కాపీ చేసాడని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ మ్యాచ్ లో పెర్త్ జట్టు బౌలింగ్ ధాటికి హోబార్ట్ జట్టు 17.1 ఓవర్లలో 98 పరుగుల వద్ద ఆల్ అవుట్ కావడంతో, 77 పరుగుల తేడాతో ఓడిపోయింది. వెటరన్ బ్యాట్స్ మాన్ జార్జ్ బెయిలీ పోరాడిన ఉపయోగం లేకపోయింది.
Josh Inglis whacks this one for six, and draws a @Bazmccullum comparison from Ricky Ponting! #BBL09 pic.twitter.com/9ZRdTKDge3
— KFC Big Bash League (@BBL) January 13, 2020