అందమైన సీతాకోక చిలుకలు చూసి ఇష్టపడని వారంటూ ఉండరు. రంగు రంగుల సీతకోకచిలుకలంటే అందరికి ఇష్టమే, అయితే సీతాకోకచిలుకలు ఉన్న ప్రాంతాల్లోనే ఒక చెట్టుమీది పూల నుంచి మరో చెట్టుమీద పూలపైకి వాలుతుంటాయి. అలాంటి అందమైన సీతాకోక చిలుకలు అన్ని ఎగిరేముందు ఓ చెట్టుపై విశ్రాంతి తీసుకోవడం మీరు ఎప్పుడైనా చూశారా. ఇక లక్షల సంఖ్యలో బటర్‌ఫ్టైస్ అందమైన రంగుల కుప్పగా ఒకేచోట సందడి చేయడం మీకెప్పుడైనా చూశారా. ఇక అలాంటి వీడియోను క్లిక్‌మనిపించింది ఓ మరపక్షి. ఇక ఈ వీడియో చూసినవారంతా మైమరిచిపోతున్నారు. అందుకే నెట్టింట హల్‌చల్ చేస్తోంది ఈ వీడియో.
ఇక ఓ రోబోటిక్ హమ్మింగ్ బర్డ్‌ను అమెరికాలోని మెక్సికన్ అరణ్యంలో వదిలారు. ఇక నిజమైన పక్షిలా ఎగురుతూ కనిపించేలా రెండు ప్రొపెల్లర్స్ ను ఉపయోగించారు. మరపక్షికి స్పై కెమెరా అమర్చారు. ఇది నిజం పక్షిలాగే అడవిలో కలియతిరుగుతూ దాదాపు అరబిలియన్ సీతాకోక చిలుకలను వీడియో తీశారు. తాము రూపొందించిన రోబోటిక్ హమ్మింగ్‌బర్డ్ సీతాకోక చిలుకల సమూహం వీడియోను అద్భుతంగా తీసిందని అన్నారు. ఈ వీడియోను చూసినవారంతా వావ్ అనకుండా ఉండలేరని ఈ ప్రాజెక్ట్ ప్రతినిధి వెల్లడించాడు. మరెందుకు ఆలస్యం ఆ వీడియోను చూసి మీరూ మైమరిచిపోండి.