మహేష్ బాబుకి జగనన్న విద్యా వసతి దీవెన…!

-

ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారు. అర్హులు అందరికి సంక్షేమ కార్యక్రమాలు అందాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే దూకుడుగా అడుగులు వేస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే సంక్షేమం ఆగకూడదు అని భావిస్తున్న ఆయన పాదయాత్రలో ఇచ్చిన మాటకు, ఎన్నికల ప్రచారం చెప్పిన హామీకి అహర్నిశలు కష్టపడుతున్నారు ముఖ్యమంత్రి.

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో జరుగుతున్న తప్పులు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల అమ్మ ఒడి విషయంలో తప్పులు అధికారులు చేసారు. భూమి లేని వారికి కూడా భూమి ఉన్నట్టు చూపించింది. దీనికి తోడు పిల్లలు లేని వారు కూడా అర్హులు అయ్యారు. తాజాగా ప్రవేశ పెట్టిన జగనన్న విద్యా వసతి దీవెన కూడా ఇదే తరహాలో ఆశ్చర్యం కలిగించింది.

సినీ హీరో మహేష్ బాబుని లబ్ది దారుగా చేర్చారు. పత్తికొండ నియోజకవర్గంలోని వైష్ణవి డిగ్రీ కళాశాలలో బీకాం ప్రథమ సంవత్సరం చదువుతున్న ఈడిగ లోకేశ్‌గౌడ్‌తో పాటు ఎమ్మిగనూరులోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న పరంపోగు లక్ష్మి జగనన్న విద్యాదీవెన పథకం కింద ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. లోకేశ్‌గౌడ్‌కు ఇప్పటికే కార్డు అందగా.. లక్ష్మికి ఇంకా అందాల్సి ఉంది.

ఆమె కార్డు ప్రస్తుతం గ్రామ సచివాలయ ఉద్యోగుల వద్దే ఉండగా, లోకేష్ ఫోటో ప్లేస్ లో మహేష్ బాబు ఫోటో ఉంది. దీనితో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. పొరపాటును అధికారుల దృష్టికి తీసుకెళ్లగా సచివాలయ ఉద్యోగుల ద్వారానే ఈ తప్పు జరిగింది అని చెప్పారు. ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టీడీపీ మాత్రం లబ్ది దారులను తగ్గించే కుట్ర అంటూ ఆరోపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version