థియేటర్లలోకి సొంత ఫుడ్ తీసుకెళ్లొచ్చు.. తేల్చి చెప్పిన ఆర్‌టీఐ సమాధానం..

-

మన దేశంలో ఏ ప్రాంతంలో ఉన్న ఏ థియేటర్‌కు వెళ్లినా వాటిలో ఆహార పదార్థాలు, వాటర్ బాటిల్స్‌కు ధరలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. బయటికన్నా చాలా ఎక్కువ రేట్లకు వాటిని విక్రయిస్తుంటారు. పోనీ ఇంటి నుంచి తీసుకెళ్దామా.. అంటే బయటి ఫుడ్‌ను థియేటర్ల యాజమాన్యాలు లోపలికి అనుమతించవు. అదే విషయాన్ని వారు మనకు చెబుతుంటారు. ఇది ఇందులో ఎంత మాత్రం నిజం లేదు. పచ్చి అబద్దం. ఎందుకంటే.. ఎవరైనా సరే.. తమ సొంత ఫుడ్‌ను బయటి నుంచి థియేటర్ల లోపలికి తీసుకెళ్లవచ్చు. అవును, మీరు విన్నది నిజమే. ఓ యాక్టివిస్టు ఆర్‌టీఐ ద్వారా సదరు సమాచారాన్ని రాబట్టాడు.

హైదరాబాద్‌కు చెందిన యాంటీ కరప్షన్ యాక్టివిస్టు విజయ్ గోపాల్ హైదరాబాద్ పోలీసులకు ఆర్‌టీఐ (సమాచార హక్కు చట్టం) ద్వారా పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టాడు. వాటిలో ఒకటి.. థియేటర్లలోకి బయటి ఫుడ్‌ను తీసుకెళ్లవచ్చా..? అని.. అయితే అందుకు అవుననే పోలీసులు సమాధానం ఇచ్చారు. అంటే దేశంలో ఎవరైనా సరే.. ఏ థియేటర్ లోపలికి అయినా సరే.. తమ సొంత ఫుడ్ లేదా బయటి ఫుడ్‌ను తీసుకెళ్లవచ్చు. దాన్ని థియేటర్ యాజమాన్యాలు అడ్డుకునే హక్కు లేదు. ఈ క్రమంలోనే ఒక వేళ థియేటర్ యాజమాన్యాలు ప్రేక్షకులకు ఉండే ఆ హక్కును అంగీకరించకపోతే సదరు యాజమాన్యాలపై లీగల్ మెట్రాలజీ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. ఈ క్రమంలో అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేస్తారు. అయితే ఈ విషయం ఇప్పటికీ చాలా మందికి తెలియదు. కానీ 1955 సినిమా రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఎప్పటి నుంచో ఈ వెసులు బాటు ప్రేక్షకులకు ఉంది. కానీ దాన్ని ఎవరూ ఉపయోగించుకోవడం లేదు. ఈ విషయం తెలియక ప్రేక్షకులు బాగా డబ్బులు వెచ్చించి థియేటర్లలో ఆహార పదార్థాలను కొనుగోలు చేస్తున్నారు. ఇకనైనా అందరూ ఈ విషయాన్ని తెలుసుకుని ఇతరులకు తెలియజేయండి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version