బాలకృష్ణ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘రూలర్’ సిద్ధమవుతోంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. అసలు మ్యాటర్ లోకి వస్తే.. బాలకృష్ణ హీరోగా, బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ మధ్యనే పూజా కార్యక్రమాలను కూడా జరుపుకుంది. ఈ సినిమాని మిరియాల రవీందర్ నిర్మిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన సింహా – లెజెండ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ముడవసారి కూడా వీరి కాంబినేషన్స్ తెరపైకి వస్తుండడంతో అంచనాలు భారీగా పెరిగాయి.
ఇదిలా ఉంటే.. ఈ ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్న కొత్త సినిమాకు సంబంధించిన ఈ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమా కోసమై బోయపాటి శ్రీనుకు నందమూరి నటసింహం బాలకృష్ణ కంటే ఎక్కువ రెమ్మ్యూనరేషన్ అందుతోందనేది తాజా సమాచారం. 70 కోట్ల బడ్జెట్ తో మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకిగాను బాలకృష్ణ 10 కోట్ల పారితోషికాన్ని అందుకుంటూ ఉండగా, బోయపాటి పారితోషికం 15 కోట్లు అని తెలుస్తోంది. బాలకృష్ణ కంటే ఎక్కువ పారితోషికాన్ని ఆయన అందుకుంటూ ఉండటం, ‘వినయ విధేయ రామ’ వంటి భారీ పరాజయం తరువాత ఆయన ఆ స్థాయిలో డిమాండ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.