ఈడీ అంటేనే BRS నేతలు వణికిపోతున్నారు అని ఫైర్ అయ్యారు విజయశాంతి. తమ అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ అనగానే బీఆరెస్ నేతలు వణికిపోతున్నరు. ఈడీ విచారణలో వెలువడే నిర్ణయం వారికి వ్యతిరేకంగా ఉంటే నిరసనలు, అల్లర్లు చెయ్యడానికి సిద్ధపడి మందీ మార్బలంతో ఢిల్లీలోని ఈడీ కార్యాలయాన్ని చుట్టుముట్టారని ఆగ్రహించారు.
కోర్టుల చుట్టూ తిరుగుతున్నరు. నిజంగా తప్పు చెయ్యకుంటే విచారణ ఎదుర్కోవడానికి భయమెందుకు? మినహాయింపుల కోసం కోర్టుని ఆశ్రయించడమెందుకు? కేంద్రంలో ఒకప్పుడు చక్రం తిప్పిన పార్టీకి గతంలో అధినేత్రిగా ఉన్న జాతీయస్థాయి మహిళా నాయకురాలు సైతం ఇదే సంస్థ నుంచి విచారణను ఎదుర్కోగా లేంది… ఇప్పుడు బీఆరెస్ నేతలకు ఎందుకీ ఉలికిపాటు? అని ప్రశ్నించారు.
ఏకంగా ఈడీపైనే అభాండాలు మోపుతున్నరు. నీతిమంతులమని చెప్పుకుంటున్నవారు ఈడీకి వ్యతిరేకంగా తమ పిటిషన్ అత్యవసర విచారణ కోసం ఆత్రపడటం చుస్తూంటే… ఆ భయమేంటో తెలుస్తూనే ఉందన్నారు విజయశాంతి.