పెందుర్తి ఆరు మర్డర్స్ కేసులో ఆరు మృతదేహాలను కేజీహెచ్ మార్చురీలో ఉంచారు. ఈ రోజు ఆరుగురు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. పోస్టుమార్టం అనంతరం బాడీలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తారని అంటున్నారు. ఇప్పటికే మార్చురీ వద్దకు విజయ్ కుటుంబీకులు పెద్ద ఎత్తున చేసుకున్నారు.
ఈ హత్యలలో అప్పలరాజు తో పాటు మరో ఆరుగురు ఉన్నారని విజయ్ అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. వారిని కూడా అదుపులోకి తీసుకుంటేనే పోస్టుమార్టం కు ఒప్పుకుంటానని అంటున్నాడు విజయ్. బత్తిన అప్పలరాజు లతోపాటు దుర్గాప్రసాద్, గౌరీష్, శ్రీనులను కూడా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నాడు. బత్తిన అప్పలరాజు,దుర్గాప్రసాద్, గౌరీష్, శ్రీనులను కూడా శిక్షించాలని, వారందరినీ ఎన్ కౌంటర్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నాడు. దీంతో ఈ కేసు పోలీసులకు సవాల్ గా మారింది.