అడ్రస్ ప్రూఫ్ లేకుండానే గ్యాస్ సిలిండర్…!

-

మీరు కొత్త గ్యాస్ సిలిండర్ కనెక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే ఇక నుండి అడ్రస్ ప్రూఫ్ అవసరం లేదు. గతం లో అయితే ఎటువంటి అడ్రస్ ప్రూఫ్ లేక పోతే గ్యాస్ కనెక్షన్ తీసుకోవడం అయ్యేది కాదు. కానీ ఇప్పుడు ఎటువంటి ఎడ్రస్ ప్రూఫ్ లేకుండా గ్యాస్ కనెక్షన్ తీసుకోవచ్చు.

ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ లేకపోతే సిలిండర్ బుక్ చేసుకోవడం సాధ్య పడదు. అయితే ఇకపై అడ్రస్ ప్రూఫ్ లేక పోయినా కూడా సిలిండర్ పొందొచ్చు. తాజాగా అడ్రస్ ప్రూఫ్ కచ్చితంగా ఉండాలనే నిబంధనలను ఐఓసీ తొలగించడం జరిగింది. కేవలం ఇది 5 కేజీల సిలిండర్‌కు మాత్రమే వర్తిస్తుంది. కేవలం ఎదో ఒక ఐడెంటిటీ ప్రూఫ్ చూపిస్తే చాలు. ఇది ఇలా ఉండగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పేదలకు కోటి ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్లు అందిస్తామని ప్రకటించింది.

మీరు ఉజ్వల స్కీమ్ వెబ్‌సైట్‌కు వెళ్లి ఉచిత కనెక్షన్ కోసం అప్లై చేసుకోవచ్చు. కనెక్షన్ కోసం మీరు సైట్ నుంచి ఫామ్ డౌన్ లోడ్ చేసుకొని మీ దగ్గరిలోని గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళ్లి ఇస్తే చాలు గ్యాస్ కనెక్షన్ లభిస్తుంది. ఆధార్, జన్ ధన్ ఖాతా వంటి కేవైసీ డాక్యుమెంట్లు కూడా అందించాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news