అభినందన్ పాత్రలు విజయ్ దేవరకొండ.. అభిమానులు ఫుల్ ఖుష్..?

-

ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ హీరోగా పరిచయమై అర్జున్ రెడ్డి సినిమా తో స్టార్ హీరోగా ఎదిగాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత కేవలం టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్ లో కూడా ఒక రేంజ్ లో క్రేజ్ సంపాదించాడు. ఇదిలా ఉంటే త్వరలో టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో హీరోగా ఒక సినిమా చేయబోతున్నారు అని టాక్ అటు టాలీవుడ్ టౌన్ లో .. ఇటు బాలీవుడ్ టౌన్ లో కూడా వైరల్ గా మారిపోయింది.

అది కూడా భారత్ కమాండర్ అభినందన్ పాత్రలో విజయ్ దేవరకొండ నటించబోతున్నాడట. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ అభిమానులు మాత్రం ఈ వార్త వైరల్ అవుతుండడంతో ఎంతగానో మురిసిపోతున్నారు. ఇక విజయ్ దేవరకొండ అభినందన్ పాత్రలో నటిస్తున్న సినిమా అభిషేక్ కపూర్ రూపొందించనున్నారు అనే టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించి అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన బయటికి రాకపోయినప్పటికీ… ఈ వార్త మాత్రం ప్రస్తుతం అభిమానులను ఆకర్షిస్తోంది

Read more RELATED
Recommended to you

Latest news