ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటోంది. మిగతా రాష్ట్రాలలాగా ఎక్కువ మొత్తంలో టెస్టులు చేయడం లేదు అంటూ.. తెలంగాణ ప్రభుత్వం పై ఎన్నో విమర్శలు రాగా గతంలో తెలంగాణ హైకోర్టు కూడా దీనిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే గతంలో రాష్ట్రంలో 40 వేల వరకు ప్రతిరోజు టెస్టులు చేస్తామని హైకోర్టుకు తెలిపింది ప్రభుత్వం.
ప్రభుత్వం చెప్పిన మాటలు ఆచరణలోకి రాకపోవడంతో మరోసారి తెలంగాణ ప్రభుత్వం పై హైకోర్టు సీరియస్ అయింది. మహారాష్ట్రలో రోజుకి ఒకటిన్నర లక్షల కరోనా టెస్టులు చేస్తున్నారని తెలంగాణలో మాత్రం ఎందుకు చేయడం లేదు అని ప్రశ్నించింది. మిగతా రాష్ట్రాలతో పోల్చి చూస్తే కరోనా రోగులకు సౌకర్యాలు కల్పించడంలో.. కరోనా టెస్టుల విషయంలో కూడా ఆ ప్రాంతం వెనుకబడి ఉంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. 40వేల టెస్టులు చేస్తాము అని చెప్పిన తెలంగాణ సర్కారు.. ఎందుకు చేయడం లేదో వివరణ ఇవ్వాలంటూ సీరియస్ అయ్యింది హైకోర్టు.