వామ్మో.. ఏపీలో రూ.92 కోట్ల మద్యాన్ని గుటుక్కు మనిపించేశారుగా..

-

పాత సంవ‌త్స‌రానికి గుడ్ బై చెప్పి.. కొత్త సంవ‌త్సరానికి వెల్ క‌మ్ చెప్పేసాం. కొత్త సంవ‌త్స‌రంలో కోరుకున్న ప‌నులు జ‌ర‌గాల‌ని, ఈ ఏడాది కూడా మంచి జ్ఞాప‌కాల‌తో సంతోషంగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటున్నారు. మ‌రోవైపు న్యూ ఇయ‌ర్ అంటే ఎక్క‌డ చూసినా పార్టీల సంద‌డే ఎక్కువ‌గా క‌నిపిస్తుంటుంది. ఇక న్యూ ఇయ‌ర్ వ‌చ్చిందంటే మందుబాబుల‌కు పండ‌గే. అయితే న్యూ ఇయర్‌కు స్వాగతం పలుకుతూ ఏపీలో ఏకంగా రూ.92 కోట్ల విలువైన మద్యాన్ని గుటుక్కు మనిపించేశారట. డిసెంబరు 30, 31వ తేదీల్లో భారీ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ ద్వారా తెలిసింది.

సాధారణంగా సగటున రోజుకు రూ.60 కోట్ల విలువైన మద్యం అమ్ముడవుతుంది. కానీ.. డిసెంబరు 30, 31 తేదీల్లో అంతకుమించి అమ్మకాలు జరిగాయి. ఫలితంగా ఈ రెండు రోజుల్లో ఏకంగా రూ.170 కోట్ల విలువైన విక్రయాలు జరిగాయి. వీటిలో బీర్, లిక్కర్ ఉన్నాయి. బుధవారం ఒక్క రోజే 1.65 లక్షల కేసుల లిక్కర్‌, 60 వేల కేసుల బీరు అమ్మకాలు జరిగినట్టు తెలుస్తోంది. దీనిని బట్టి న్యూ ఇయర్‌ను మందుబాబులు ఎంత ఘనంగా ఆహ్వానించారో అర్థం చేసుకోవచ్చు

Read more RELATED
Recommended to you

Exit mobile version