Vijay deverakonda : ఫ్యామిలీ స్టార్‌’ రిలీజ్ డేట్ ఖరారు చేసిన దిల్ రాజు

-

పరశురాం దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’ . మృణాళ్ ఠాకూర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకొంటున్న ఈ మూవీ వేసవిలో ప్రేక్షకులకు వినోదం పంచేందుకు సిద్ధమవుతుంది.

మొద‌ట ఈ సినిమాను సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేయాలి అని అనుకున్నారు కానీ సంక్రాంతికి పెద్ద సినిమాలు విడుదల కావడంతో బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన పోటీ నెలకొంది. దీంతో ఈ సినిమాని వాయిదా వేశారు. అయితే మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ నటిస్తున్నటువంటి దేవర చిత్రాన్ని వాయిదా వేశారు . దీంతో విజయ్ దేవరకొండ నటిస్తున్నటువంటి ఫ్యామిలీ స్టార్ సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 5న విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా చిత్ర యూనిట్ ప్రకటించింది. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేయగా అందులో విజయ్ దేవరకొండ తన నోట్లో రేషన్ కార్డును పట్టుకొని పరిగెత్తుతూ ఉన్నట్టు కనిపిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news