ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో తెలంగాణ పునర్నిర్మాణ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇంద్రవెల్లి సభలో బీఆర్ఎస్ పై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. ‘6నెలల్లో ప్రభుత్వం పడగొట్టి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని బీఆర్ఎస్ వాళ్లు అంటున్నారు. నీ అయ్య ఎవడ్రా ప్రభుత్వాన్ని పడగొట్టేటోడు. ఎవడు కొట్టేది? మీ ఊర్ల ఎవడన్నా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే వేపచెట్టుకి కోదండం వేసి కొట్టండి. లాగులో తొండలు విడవండి’ అని రేవంత్ పిలుపునిచ్చారు. కేసీఆర్కు గద్దర్ ఉసురు తాకిందని రేవంత్ అన్నారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తే బీఆర్ఎస్ నేతలకు కడుపునొప్పి ఎందుకని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ఇక.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ నాగోబాను దర్శించుకున్నారు. ఈ పూజల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.