లోకేష్ కనగరాజ్ “లియో” మూవీ పైనే విజయ్ ఆశలన్నీ !

-

తమిళ స్టార్ హీరో విజయ్ తలపతి తాజాగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న చిత్రం “లియో”. ఈ సినిమాను యంగ్ అండ్ సెన్సషనల్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ చాలా ఫ్యాషన్ గా తీసుకుని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ అన్ని ప్లాన్ లు చేసుకున్నారు. ఇప్పటికే సినిమా విడుదల తేదీని దసరా పండుగా కానుకగా అక్టోబర్ 19 గా ప్రకటించిన మూవీ యూనిట్ ఒక్కొక్కటిగా బాలన్స్ పనులను పూర్తి చేసే పనిలో పడింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుండడంతో ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్ముతున్నారు. కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం లియో సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు/ఏ సర్టిఫికెట్ దక్కింది.

కాగా ఈ సినిమా రన్ టైం ను 2 గంటల 44 నిముషాలుగా ఫైనల్ చేశారు. విజయ్ కెరీర్ లో లేటెస్ట్ గా వచ్చిన వారసుడు మరియు బీస్ట్ లు ప్రేక్షకులను మెప్పించకపోవడంతో దీనిపైనే విజయ తన ఆశలన్నీ పెట్టుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news