ధనత్రయోదశి ముందు రోజున బంగారం ధర భారీగా తగ్గింది.ధనత్రయోదశి రోజున బంగారం కొనడం సెంటిమెంట్ గా భావిస్తారు మహిళలు. త్రయోదశికి సరిగ్గా ఒక్కరోజుకు ముందు బంగారం తగ్గుదల శుభవార్తగానే చెప్పాలి. గ్లోబల్ మార్కెట్‌లో కూడా స్పాట్ గోల్డ్ ధర ఇదే దారిలో నడిచింది. ఏకంగా 5 శాతం పతనమైంది. ఆగస్ట్ నెల నుంచి చూస్తే బంగారం ధర ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి.
బంగారం ధరతో పాటే వెండి ధర కూడా మార్కెట్లో తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,380కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు ధర రూ.47,100కు చేరింది. కోవిడ్ 19 వ్యా్క్సిన్‌పై పలు కంపెనీలు చేసిన ప్రకటన కూడా దీనికి కారణంగా తెలుస్తుంది.