విజయ్ పాపులారిటీని క్యాష్ చేసుకోనున్న నిర్మాతలు.. సూపర్ డీలక్స్ తెలుగులోకి.

Join Our Community
follow manalokam on social media

ఉప్పెన సినిమాతో తమిళ నటుడు విజయ్ సేతుపతికి తెలుగులో వచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఇప్పటి వరకూ తెలుగులో ఒక్క సినిమా మాత్రమే చేసిన విజయ్ సేతుపతికి చాలా మంది అభిమానులు ఏర్పడ్డారు. ఉప్పెన సినిమాలో ఆయన నటనకు తెలుగు ప్రేక్షకులందరూ ఫిదా అయ్యారు. దాంతో తెలుగు నిర్మాతలు విజయ్ సేతుపతి తమిళ సినిమాలని తెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం తమిళంలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సూపర్ డీలక్స్ సినిమాని తెలుగులోకి అనువదించనున్నారట.

సూపర్ డీలక్స్ సినిమాలో విజయ్ సేతుపతితో పాటు మళయాల నటుడు ఫాహద్ ఫాజిల్, సమంత, రమ్య క్రిష్ణ కూడా ఉన్నారు. వీరి పాపులారిటీ కూడా ఇక్కడ వర్కౌట్ అవుతుందని, అదీగాక సూపర్ డీలక్స్ సినిమాలో ట్రాన్స్ జెండర్ గా విజయ్ సేతుపతి నటన మరో లెవెల్లో ఉంటుంది గనక తెలుగులో వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారు. ముందు ముందు మరిన్ని విజయ్ సేతుపతి సినిమాలు తెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

TOP STORIES

మీ బలహీనతని కూడా మీ బలంగా మార్చుకోవాలంటే ఇలా చేయండి…!

ప్రతి ఒక్కరికి కొన్ని కొన్ని బలహీనతలు ఉంటాయి. ఎప్పుడైతే ఆ బలహీనతని కూడా బలంగా మార్చుకుంటారో అప్పుడు తప్పక విజయం అందుకోగలరు. అయితే కొన్ని కొన్ని...