40 ఏళ్ల TDP చరిత్రపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

తెలుగుదేశం స్థాపకుడు ఎన్‌.టి.రామారావు 40 ఏళ్ల క్రితం 1983 జనవరి 9న తొలిసారి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయిన సందర్భాన్ని టీడీపీ అధినేత ఎన్‌.చంద్రబాబు నాయుడు సోమవారం గుర్తుచేసుకోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోందనీ వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చురకలాంటించారు. ఈ కార్యక్రమంలో చెప్పిన మాటలు ఆయన స్వభావాన్ని మరోసారి బట్టబయలు చేశాయనీ ఫైర్ అయ్యారు.

 

‘నాటి దారుణ రాజకీయ పరిస్థితులు, ప్రజల వెతలను చూసిన ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారు,’ అని చంద్రబాబు సెలవిచ్చారు. నిజానికి ఏపీలో అప్పటి పాలకపక్షం కాంగ్రెస్‌–ఐలో చంద్రబాబు సభ్యుడు. టీడీపీ స్థాపన సమయంలో (1982 మార్చి) ఆయన కాంగ్రెస్‌ మంత్రివర్గంలో మంత్రి. 1983 జనవరి మొదటి వారంలో జరిగిన ఉమ్మడి ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ కేబినెట్‌ మంత్రిగా ఉన్న చంద్రబాబు తన మామ గారి పార్టీలో వెంటనే చేరలేదు. అంతేకాదు, ‘కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఆదేశిస్తే నా మామ ఎన్టీఆర్‌ పై కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేయడానికి నేను సిద్ధమే,’ అని నాటి యువ మంత్రి నారా వారు ప్రకటించారన్నారు.

 

 

ఎన్టీఆర్‌ సీఎం అయిన తర్వాతే చంద్రబాబు టీడీపీలో తెర వెనుక ‘కీలక’ పాత్ర పోషించడం మొదలుబెట్టారు. తాను సహాయ మంత్రిగా ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాల పాలనలో ప్రజలు కష్టాలు పడ్డారనీ, అందుకే ఎన్టీఆర్‌ తెలుగుదేశం ప్రారంభించారని ఇప్పుడు చెబుతున్న చంద్రబాబు మరి అప్పుడు అలాంటి ‘దుర్మార్గ ప్రభుత్వం’ నుంచి ఎందుకు వైదొలగలేదో చెప్పకపోవడం విశేషం. టీడీపీ స్థాపన ద్వారా తెలుగు ప్రజలను ఎన్టీఆర్‌ కాపాడారని చంద్రబాబు ఇప్పుడు అంటున్నారనీ ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news