టిఆర్ఎస్ ఎంపీ కవితను అవమానించారు కేసీఆర్. ఆ వీడియోను షేర్ చేశారు రాములమ్మ. నేడు బీఆరెస్, అంతకు ముందు టీఆరెస్… పేరు మార్పు తప్ప కేసీఆర్ గారి నాయకత్వంలోని ఆ పార్టీ పద్ధతులు, విధానాల్లో ఏ మార్పూ లేదనడానికి ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోయే పెద్ద ఉదాహరణ అంటూ ట్వీట్ చేశారు.
బీఆరెస్ అధినేత కేసీఆర్ తమ పార్టీ నాయకులు ఏ మాత్రం ఎదగకుండా కట్టడి చేస్తూ వారిని కీలుబొమ్మల్లా తయారు చేస్తున్నరు.ఏ ఆత్మగౌరవం పేరిట తెలంగాణ కోసం కొట్లాడినమో… ఆ ఆత్మగౌరవం ఈ స్థాయికి అవమానించబడటం అన్యాయం, దుర్మార్గం, బాధాకరం కూడా కేసీఆర్ గారూ… అని ఫైర్ అయ్యారు.
మీరు మారరు. ప్రజలే మిమ్మల్ని మారుస్తరు, గద్దె దింపి ఎల్లగొడ్తరు.ఇక జనం నెత్తికి టీఆరెస్ పేరిట అసత్యాలతో అనునిత్యం టోపీ పెట్టే ఈ సీఎం గారు, గీ మధ్య బీఆరెస్ పెట్టి తన నెత్తికి తనే టోపీ పెట్టుక తిరుగుతున్నరు.బీఆరెస్ అంటే భస్మాసుర రాష్ట్ర సమితి అని కావచ్చు… ఈ స్వంత నెత్తికి కేసీఆర్ గారి టోపీ సంకేతం అన్నారు విజయశాంతి.