తెలంగాణే బాకీ ఉంది..పార్లమెంట్‌లో తేల్చుకుంటాం : విజయసాయిరెడ్డి

తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్‌ బకాయిల గురించి పార్లమెంట్‌ లో ప్రస్తావిస్తామని.. తెలంగాణ రాష్ట్రం నుంచి తమకు రూ. 6112 కోట్లు విద్యుత్‌ బకాయిలు రావాలని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ నుండి విద్యుత్ బకాయిలు చెల్లించాలని కోరుతున్నామన్నారు విజయసాయి రెడ్డి. 800 అడుగుల్లోనే లిఫ్ట్ కి అనుమతి ఇవ్వాలని కోరామని… చంద్రబాబు హయం లో తెలంగాణ అనేక ప్రాజెక్ట్ లు కడుతోందన్నారు. ఏపీ వాటా నీటిని పోతిరెడ్డి పాడు ద్వారా తీసుకెళ్లడం దారుణమన్నారు.

ysrcp mp vijayasai reddy

ఉమ్మడి ప్రాజెక్ట్ లను కేంద్రం పరిధి లోనికి తీసుకోవాలని పేర్కొన్నారు. పోలవరం విషయంలో 55,656 కోట్ల రివైస్‌డ్‌ కాస్ట్ ఎస్టిమేట్ కింద అంగీకరించేలా చూడాలని… పోలవరంలో ఏపీ ప్రభుత్వం ఖర్చు చేస్తే తరువాత రియంబర్స్‌మెంట్‌ చేస్తున్నారన్నారు. రాయల సీమ ఎత్తిపోతల కింద ఒక్క నీటి చుక్కను తీసుకునేది లేదని.. 25 రోజులకు మించి డ్రా చేయాలని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటి కరణ చేసే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూన్నామన్నారు. ఈ నెల 19 న జరిగే పార్లమెంట్‌ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం జగన్‌ కీలక ఆదేశాలు చేశారని తెలిపారు.