టీడీపీలోకి విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులు !

-

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సమీప బంధువు టీడీపీలో చేరనున్నారని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. దీనితో వైకాపా ఎత్తిపోయిందోచ్ అని అర్థమవుతుందని, వైకాపా ఎలాగో అధికారంలోకి రాదని తెలిసిపోయిన రాయలసీమలోని ప్రముఖ రెడ్డి నాయకులు టీడీపీలో చేరబోతున్నారని తెలిపారు. విజయసాయిరెడ్డి గారి బావమరిది ద్వారకానాథ్ రెడ్డి గారు రెండు రోజుల వ్యవధిలో టీడీపీ కండువా కప్పుకోనున్నారని, ద్వారకానాథ్ రెడ్డి తండ్రి గారు కూడా శాసనసభ్యులుగా పనిచేశారని చెప్పారు.

రాయలసీమకు చెందిన నిజమైన రెడ్డి నాయకులకు భ్రమలు తొలిగి, ఆలస్యంగానైనా నిజాలను గ్రహించి టీడీపీలో చేరాలని భావిస్తుండడంతో టీడీపీ – జనసేనలో పరిస్థితి కల కల అన్నట్టుగా ఉండగా, వైకాపా పరిస్థితి విలవిలా అన్నట్టుగా ఉందని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. విజయవాడలో మల్లాది విష్ణు గారికి సీటు లేదని చెప్పారని, మరొక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని విజయవాడ వెస్ట్ నుంచి సెంట్రల్ కు ట్రాన్స్ఫర్ చేశారని, ఇక పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన దళిత శాసనసభ్యుడైన ఎమ్మెస్ బాబు గారికి కూడా సీటు లేదని చెప్పడంతో… నేను ఏనాడు సొంతంగా నిర్ణయం తీసుకోలేదని, మంత్రి పెద్దిరెడ్డి గారు చెప్పినట్లుగానే చేశానని, సొంతంగా నిర్ణయం తీసుకున్నది లేదని, నాలుగున్నర ఏళ్లుగా వారు చెప్పినట్లు నడుచుకున్న నాకు సీటు లేదు కానీ వారికి మాత్రం సీటు ఇస్తారా అంటూ ప్రశ్నించారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news