బాబు బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారు: విజయసాయి రెడ్డి

-

చంద్రబాబు నాయుడును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ లో ఉంచగా, కోర్ట్ లలో ఏ విషయం పైన పిటిషన్ లు వేసినా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే వచ్చే వారంలో జరగనున్న సుప్రీమ్ కోర్ట్ విచారణ మీదనే చంద్రబాబు నాయుడు ఆధారపడి ఉన్నాడు. ఇక లేటెస్ట్ గా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జైలు నుండి బయటకు వస్తే సాక్ష్యాలు అన్నీ కూడా తారు మారు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయంటున్నారు. దేశరాజకీయాల గురించి సమగ్రమైన అవగాహన ఉన్న వ్యక్తి మరియు ప్రధాని రాష్ట్రపతులు ఎవరు అయితే దేశానికి బాగుంటుందో నిర్ణయించే వ్యక్తి , ఢిల్లీలో చక్రం తిప్పిన స్వయం ప్రకటిత సాంకేతిక పరిజ్ఞాన ఆవిష్కర్త గా చెప్పుకునే చంద్రబాబు బయటకు వస్తే సత్యం, న్యాయం మరియు ధర్మాలను బ్రతకనిస్తారా అని చాలా సెటైరికల్ గా కామెంట్ చేశారు విజయసాయి రెడ్డి.

అయిత్ వైసీపీ వాళ్ళ నమ్మకం చూస్తుంటే బాబును ఇప్పుడప్పుడే జైలు నుండి బయటకు రాణించేలా లేరని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news