కరోనా వైరస్ ఏ స్థాయిలో ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రాజకీయ నాయకుల తీరులో ఏ మార్పు రావడం లేదు, బిజెపి, టీడీపీ, వైసీపీ నేతలు ఇష్టం వచ్చిన విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. విజయసాయి రెడ్డి, కన్నా లక్ష్మీ నారాయణ, చంద్రబాబు నాయుడు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వ్యక్తిగత విమర్శలు దేవుడి మీద ప్రమాణాల వరకు విమర్శలు వెళ్ళాయి.
ఒక పక్క కరోనా తీవ్ర స్థాయిలో ఉన్న తరుణంలో ‘విశాఖ రాజధానిగా వచ్చి తీరుతుంది. దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. అది ఎప్పుడు అన్నది త్వరలో నిర్ణయం ఉంటుంది’ అంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు. కరోనా తీవ్ర స్థాయిలో ఉన్న తరుణంలో ఈ వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారని, ఇప్పుడు వైరస్ కట్టడి కావడంపై సలహాలు ఇవ్వాలి గాని ఈ స్థాయిలో ఎందుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ భీమిలి నియోజకవర్గంలోని మంగమారిపేట గ్రామంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. ఇక అమరావతి ప్రాంతంలో తీవ్ర స్థాయిలో నిరసనలు జరుగుతున్నాయి. కరోనా కారణంగా వాళ్ళను రాజధాని ఉద్యమం చేయవద్దు అంటూ పోలీసులు ఆదేశాలు ఇచ్చారు. ఈ తరుణంలో మరి విజయసాయి ఎందుకు మాట్లాడుతున్నారని, రాజకీయ విమర్శలు ఎందుకు అని నిలదీస్తున్నారు.