హ‌రీష్ రావు ఎన్ని క‌థ‌లు ప‌డ్డా కేటీఆరే నెక్స్ట్ సీఎం : విజ‌య‌శాంతి

మంత్రి హ‌రీష్ రావుపై బీజేపీనేత విజ‌య‌శాంతి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ద‌ళితుల ప‌ట్ల గౌర‌వంలేని హ‌రీష్ రావుకు హుజురాబాద్ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం సిగ్గుచేటు అంటూ విజ‌య‌శాంతి ఫైర్ అయ్యింది. హ‌రీష్ రావు ఢిల్లీలో ద‌ళిత ఉద్యోగును బూతులు తిట్టార‌ని…చేయి కూడా చేసుకున్నారంటూ రావుల‌మ్మ మండిప‌డింది. కేసీఆర్ ద‌ళిత ద్రోహి అయితే హ‌రీష్ రావు ద‌ళిత ద్రోహి అంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. వీరిద్ద‌రికీ కూడా హుజురాబాద్ నియోజ‌వ‌ర్గం క‌ర్రు కాల్చి వాత‌పెట్టాలంటూ విజ‌య‌శాంతి ఆరోపించింది.

ద‌ళితుల ప‌ట్ల అగౌర‌వంగా మాట్లాడిన హ‌రీష్ రావు ముక్కు నేల‌కు రాసి క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ విజ‌య‌శాంతి ఫైర్ అయ్యింది. హ‌రీష్ రావు ద‌ళితుల గురించి మాట్లాడ‌టం దెయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్టే ఉందంటూ ఆరోప‌ణ‌లు చేసింది. హ‌రీష్ రావు ఎన్ని మాట‌లు మాట్లాడినా..ఎన్ని క‌థ‌లు ప‌డినా కేటీఆర్ నే కేసీఆర్ సీఎం చేస్తారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. అంతే కాకుండా హ‌రీష్ రావును కేసీఆర్ పార్టీ నుండి వెళ్ల‌గొడ‌తారంటూ వ్యాఖ్యానించింది.