వీఆర్ఏల జీవితాలను కేసీఆర్ ఆగం చేస్తున్నాడు – విజయశాంతి

-

వీఆర్ఏల జీవితాలను కేసీఆర్‌ ఆగం చేస్తున్నాడని ఆగ్రహించారు విజయశాంతి. కేసీఆర్ సర్కార్ వీఆర్ఏల జీవితాల‌తో ఆడుకుంటుంది. మునుగోడు ఉప ఎన్నిక త‌ర్వాత వారి స‌మ్యస‌లను పరిష్కరిస్తామని చెప్పి చేతులు దులుపుకుంది. త‌ప్ప క‌నీసం వారిని ప‌ట్టించుకున్న పాపాన పోలేదని వెల్లడించారు.

వారు ఇప్పుడు ఏం చేయాలో తెలీక అయోమయంతో జీవితాల‌ను నెట్టుకొస్తున్నారు. మునుగోడు ఎన్నిక జ‌రిగి వారాలు గడుస్తున్న కేసీఆర్ సర్కార్ నుంచి ఉలుకు ప‌లుకు లేదు. వీఆర్ఏలు 83 రోజుల పాటు సమ్మె చేశారన్నారు.

అప్పుడే మునుగోడు ఉప ఎన్నిక ఉండ‌డంతో కేసీఆర్ సర్కార్ వీఆర్ఏల‌పై కంత్రి డ్రామాకు తెర‌దీసింది. ఏం కేసీఆర్ నీకు కాసంతనైన‌ దయలేదా..? ఆమాయ‌కులైన వీఆర్ఏల జీవితాల‌తో ఇంకెన్ని రోజులు ఆడుకుంటావు. కేసీఆర్ ఉద్యోగుల‌తో పెట్టుకున్న ఏ సర్కార్ కూడా బతికి బట్ట కట్టినట్లు చ‌రిత్ర‌లో లేదు. వారే మీకు, మీ సర్కార్ కు త‌గిన స‌మాధానం చెబుతారని హెచ్చరించారు విజ‌య‌శాంతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version