కెసిఆర్ సర్కారు కూలితేనే.. మంచి రోజులు : విజయశాంతి

-

కెసిఆర్ ప్రభుత్వంపై విజయశాంతి మరోసారి నిప్పులు చెరిగారు. తెలంగాణలో కీలక వ్యవస్థలు ఎంత దారుణంగా కుప్పకూలాయో అర్థం కావాలంటే నేటి పత్రికల్లో వచ్చిన కథనాల్ని గమనిస్తే చాలని…వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తున్న ఈ తెలంగాణ సర్కారు కుప్పకూలితే గాని మంచి రోజులు రావని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో భూములమ్మి ఎలాగేనా వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని సమకూర్చుకోవడం లక్ష్యంగా ఆగమేఘాల మీద రాష్ట్ర ప్రభుత్వం ఉరుకులు పరుగులు పెడుతోందని మండిపడ్డారు. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కేసీఆర్ గారు… నేడు భావితరాల ప్రయోజనాల కోసం రాష్ట్రంలో సర్కారు భూమి అన్నదే లేకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అత్యంత కీలకమైన భూములను పెద్ద మొత్తంలో అమ్మేసి, రాష్ట్రాన్ని ప్రయివేటీకరించడమే తెలంగాణ సర్కారు లక్ష్యంగా కనిపిస్తోందన్నారు.

 

ఈ భూముల అమ్మకాలపై మంత్రి హరీష్‌రావు గారు ఈ మధ్య స్పందిస్తూ… గత ప్రభుత్వాలు భూములమ్మగా లేంది… మేం చేస్తే తప్పా? అని అడిగారని… ఆ సర్కార్లు చేసిన తప్పును ఆనాడు అన్ని వర్గాలూ ఎండగట్టాయని చురకలు అంటించారు.అదే తప్పు మీరు చేస్తే, అది రైటెలా అవుతుంది?… ఈ అవకతవక రెవెన్యూ విధానాలతో పాటు తెలంగాణలో కుప్పకూలుతున్న మరొక వ్యవస్థ ఉన్నత విద్యా రంగం అని తెలిపారు. మొన్నటి వరకూ రాష్ట్రంలోని వర్సిటీలకు వీసీలు లేక వ్యవస్థ గాడి తప్పిందని… ఈ విషయమై రాష్ట్ర సర్కారుకు స్వయంగా గవర్నరే ఘాటుగా లేఖ రాసే పరిస్థితి వచ్చిందని ఫైర్ అయ్యారు. ఇప్పుడు తెరపైకి వచ్చిన మరో అంశం ఈ వర్శిటీలను తీవ్రంగా వేధిస్తున్న ప్రొఫెసర్ల కొరత అని… దాదాపు 3 వంతుల పోస్టులు (2,152) ఖాళీగా ఉన్నాయంటే విద్యా వ్యవస్థను ఈ సర్కారు ఎంతగా దిగజార్చిందో అర్థం చేసుకోవచ్చు అని పేర్కొన్నారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version