ఐసీసీపై క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్.. దారుణ‌మైన ట్రోలింగ్‌..!

-

అంత‌ర్జాతీయ టోర్న‌మెంట్‌ల‌ను నిర్వహించిన‌ప్పుడ‌ల్లా ఐసీసీ ఏదో ఒక విధంగా విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటూనే వ‌స్తోంది. 2 ఏళ్ల కింద‌ట వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ నిర్వ‌హించినప్పుడు అనేక మ్యాచ్ లు వ‌ర్షార్ప‌ణం అయ్యాయి. దీంతో ఎంతో ఉత్సాహంగా వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌ల‌ను చూద్దామ‌ని వ‌చ్చిన ప్రేక్ష‌కులు నిరాశ‌కు గుర‌య్యారు. టీవీల్లో మ్యాచ్‌ల‌ను చూసే వారు కూడా తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. అస‌లు వ‌ర్షాలు ప‌డే స‌మ‌యంలో మ్యాచ్‌ల‌ను ఎలా పెట్టారు ? అంటూ క్రికెట్ ఫ్యాన్స్ ఐసీసీని తీవ్రంగా విమ‌ర్శించ‌డ‌మే కాక ట్రోల్ కూడా చేశారు. ఇక ఇప్పుడు కూడా ఇలాగే జ‌రుగుతోంది.

జూన్ 18వ తేదీ నుంచి ఇంగ్లండ్‌లోని సౌతాంప్ట‌న్‌లో భార‌త్, న్యూజిలాండ్‌ల మ‌ధ్య మొద‌టి సారిగా ఐసీసీ వ‌ర‌ల్డ్ టెస్టు చాంపియ‌న్ షిప్ ఫైనల్ జ‌రుగుతున్న విష‌యం విదిత‌మే. అస‌లే ఐపీఎల్ వాయిదా కార‌ణంగా నిరాశ‌లో ఉన్న అభిమానులు ఈ మ్యాచ్ తోనైనా కొన్ని రోజులు క్రికెట్ వినోదాన్ని ఎంజాయ్ చేయ‌వ‌చ్చ‌ని భావించారు. కానీ ఇప్పుడు కూడా వారి ఆశ‌లు అడియాశ‌ల‌య్యాయి. మ్యాజ్ జ‌రుగుతున్న మైదానం ఉన్న ప్రాంతానికి వ‌ర్షం ముప్పు పొంచి ఉన్న‌ట్లు తెలిసింది. దీంతో అభిమానులు ఐసీసీపై మండిప‌డుతున్నారు.

మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ఆగిపోవ‌డం, వ‌ర్షం ముప్పు ఇంకా తొల‌గిపోక‌పోవ‌డంతో నెటిజ‌న్లు ఐసీసీని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. వ‌ర్షం ప‌డే మైదానాలు త‌ప్ప ఇంక ఎక్క‌డా మైదానాలు దొర‌క‌లేదా ? అని ఐసీసీని విమ‌ర్శిస్తున్నారు. అయితే ఐసీసీ దుర‌దృష్టం ఏమో గానీ.. తాను ఈవెంట్లు నిర్వ‌హించిన‌ప్పుడ‌ల్లా మ్యాచ్‌ల‌కు వ‌రుణుడు అడ్డు త‌గ‌ల‌డం ప‌రిపాటి అయింది. మ‌రి ఈ మ్యాచ్ అయినా స‌జావుగా సాగుతుందా, లేదా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version