కేటీఆర్ ను ఓడించేందుకు హ‌రీష్ రావు కుట్ర‌..రాముల‌మ్మ సంచ‌ల‌నం..!

దుబ్బాక‌లో చెల్ల‌ని హ‌రీష్ రావు వ్యూహాలు హుజురాబాద్ లో చెల్లుతాయా అంటూ రాముల‌మ్మ ప్ర‌శ్నించింది. హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయశాంతి హ‌రీష్ రావుపై మండిపడింది. దళితుడిని బూతులు తిట్టి… కొట్టిన దళిత ద్రోహి హరీష్ రావు అంటూ విమర్శించింది. హుజరాబాద్ లో దళితులపై ప్రేమ ఉన్నట్టు హరీష్ రావు నటిస్తున్నారని విజయశాంతి ఆరోపించింది. అప్పట్లో కేటీఆర్ ని ఓడించాలని హరీష్ రావు కుట్రలు చేశారంటూ సంచలన ఆరోపణలు చేసింది.

దుబ్బాక లో ప‌నిచేయ‌ని హరీష్ రావు వ్యూహాలు ఇప్పుడు హుజురాబాద్ లో చెల్లుతాయా అంటూ విజ‌య‌శాంతి ప్రశ్నలు కురిపించారు. ఇదిలా ఉంటే హుజురాబాద్ ఉపఎన్నిక‌ల నేప‌థ్యంలో పొలిటిక‌ల్ హీట్ పెరిగింది. టీఆర్ఎస్ నుండి ప్రచార భాధ్య‌త‌లు తీసుకున్న హ‌రీష్ రావు త‌ర‌చూ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తూ బీజేపీపై ఈటెల పై విమ‌ర్శ‌లు కురింపించారు. అంతే కాకుండా తాను ప్ర‌చారం చేసి విజ‌య‌శాంతిని గెలించా అంటూ వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలోనే రావుల‌మ్మ హ‌రీష్ రావు పై మండిప‌డింది.