హుజురాబాద్‌ లో ఓటుకు రూ. 6 వేలు.. ఫోటోలు వైరల్‌

హుజురాబాద్‌ నియోజక వర్గ ఉప ఎన్నిక కు కౌంట్‌ డౌన్‌ దగ్గర పడింది. ఇవాళ సాయంత్రం హుజురాబాద్‌ నియోజక వర్గ ఉప ఎన్నిక ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యం లో ప్రధాన పార్టీలన్నీ… ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అలాగే ఓటర్ల ను ప్రసన్న చేసుకునేందుకు…. ప్రలోభాలకు తెరలేపుతున్నాయి పార్టీలు. హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారనికి నేటి తో తెరపడుతున్న నేపథ్యంలో ఇక రాజకీయ పార్టీలు డబ్బుల పంపిణీ పైన దృష్టి పెట్టాయి.

ఒక్క ఓటుకు ఏకంగా రూ. 6 వేల చొప్పున ఇంటింటికి పంచుతున్నాయి. హుజురాబాద్‌ నియోజక వర్గం కమల పూర్ మందుల పరిధి లో…. పోస్ట లెటర్‌ తరహాలో డబ్బులు ప్యాక్‌ చేసి.. పంచుతున్నారు లీడర్లు. ఒక ఓటు ఉంటే కవర్‌ పై 1 అని… రెండు ఓట్లు ఉంటే.. 2 నంబర్లు వేసి.. డబ్బులు పంచుతున్నారు. అయితే.. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఈ డబ్బులను పంచినట్లు సమాచారం అందుతోంది. కాగా.. హుజురాబాద్‌ ఉప ఎన్నిక ఆ నెల 30 వ తేదీన జరుగనున్న సంగతి తెలిసిందే.