CAAకు మద్దతు ఇచ్చినందుకు గ్రామంలో నీళ్ళు ఆపేశారు, ఎంపీపై కేసు నమోదు…!

-

కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లాలో పౌరసత్వ (సవరణ) చట్టం లేదా సిఎఎకు మద్దతు ఇచ్చినందున హిందు కుటుంబాలకు నీరు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ట్వీట్ చేసినందుకు కర్ణాటక బిజెపి ఎంపి శోభా కరండ్లజే మరియు ఇతరులపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. ముస్లిం ప్రాబల్యం ఉన్న మలప్పురంలోని కుట్టిపురం పంచాయతీలోని హిందూ కుటుంబాల గురించి ఉడిపి-చిక్‌మగళూరు ఎంపీ ఎంఎస్ కరాండ్‌లాజే ట్వీట్ చేశారు.

కొత్త పౌరసత్వ చట్టానికి మద్దతు ఇస్తున్నందున నీరు ఇవ్వడం లేదని ఆమె ఆరోపించారు, ఆ ఆరోపణ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. మీడియా కూడా దీనిపై కథనాలు ప్రసారం చేసింది. దీనిపై మలప్పురం పోలీసు చీఫ్ అబ్దుల్ కరీం జాతీయ మీడియాతో మాట్లాడారు. “ఆమె తప్పుదారి పట్టించారని తప్పుడు సమాచారం వ్యాప్తి చేసారని మండిపడ్డారు.

సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసారు. మతం, జాతి, పుట్టిన ప్రదేశం, నివాసం, భాష వంటి కారణాల వల్ల వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించినందుకు గాను ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. రాష్ట్ర స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అనుబంధ సంస్థ సేవా భారతి అనే ఎన్జీఓ కార్యకర్తలపై కూడా కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రాంతంలో దాదాపు ఏడాది కాలంగా నీటి సంక్షోభం ఉంది.

“బోర్‌వెల్ సమస్యల కారణంగా దాదాపు ఒక సంవత్సరం నుండి పంచాయతీకి నీరు అందించలేకపోయింది. నీటిని సరఫరా చేయడానికి ఒక ప్రైవేట్ బోర్‌వెల్ ఉపయోగిస్తున్నారు. మోటార్ కోసం విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉందని అందుకే సరఫరా ఆగిపోయిందని పోలీసులు తెలిపారు. ఎవరో ఇచ్చిన తప్పుడు సమాచారం ఆధారంగా ఆమె ఆ ట్వీట్ చేసారన్నారు. తన మీద కేసు పెట్టుకోవచ్చని సేవా భారతి బృందం ప్రజలకు నీటి సరఫరా చేసిందని ఎంపీ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news