ఒలింపిక్స్ లో ఇండియాకు మొదటి గోల్డ్ మెడల్ సాధిస్తుంది అని అందరూ ఆశలు పెట్టుకున్న రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. 50 కిలోల విభాగంలో ఫైనల్ కు చేరుకున్న వినేష్ ఫోగట్ 100 గ్రాముల అధిక బరువు కలిగి ఉంది అనే కారణంగా ఆమెపై ఒలింపిక్స్ లో అనర్హత వేటు వేసారు.
అయితే గత ఏడాది ఢిల్లీలో జరిగిన రెజ్లర్ల ధర్నాలో కీలక పాత్ర పోషించిన వినేష్ ఫోగట్ ప్యారిస్ ఒలంపిక్స్ లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్స్ కు అర్హత సాధించి.. భారత్ కు నాలుగో మెడల్ పక్క చేయడంతో పాటుగా అందరికి గోల్డ్ పై ఆశలు రేపింది. కానీ ఇప్పుడు బంగారు ఆశలు పెట్టుకున్న భారతీయులకు అందరికి షాక్ తగిలింది అనే చెప్పాలి. అయితే రెజ్లింగ్ లో బరువును బట్టి క్యాటగిరీలు ఉంటాయి. రెజ్లర్ తాను పోటీ చేసే క్యాటగిరి బరువు కంటే ఎక్కువ బరువు ఉండకూడదు. కానీ వినేష్ ఫోగట్ 100 గ్రాముకుల అధిక బరువు ఉంది అని ఆమె పై అనర్హత వేటు వేశారు అధికారులు.