ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. వైసిపి పార్టీని చంద్రబాబు కూటమి సర్కార్ టార్గెట్ చేసి మరీ పరిపాలన సాగిస్తోంది. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ… జగన్మోహన్ రెడ్డి పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది చంద్రబాబు సర్కార్. అయితే ఇలాంటి నేపథ్యంలోనే… వైయస్ జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో.. నారా చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఇటీవల తన భద్రత తగ్గించడం పై…. జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే వైయస్ జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది.
భద్రత కుదింపు పై హైకోర్టును ఆశ్రయించిన జగన్.. తరఫున.. లాయర్ తన వాదనలను వినిపించారు. బులెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగా పనిచేయడం లేదని హైకోర్టుకు జగన్మోహన్ రెడ్డి లాయర్ తెలిపారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం నిర్వహణ ఎవరిది అని ఈ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇంటలిజెన్స్ దేనిని… ఏపీ ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. జగన్కు మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనం అలాగే జామర్ ఇవ్వచ్చు కదా అని ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. వేరే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉందో లేదో తెలుసుకొని మరి చెబుతానని… ఏజీ వెల్లడించడం జరిగింది.