ఏపీలో హింసాత్మక ఘర్షణలు..బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ పోయవద్దు: ఈసీ

-

కంటైనర్లు, బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ పోయవద్దని పెట్రోల్ బంక్ నిర్వాహకులను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు వాహనాల్లో మాత్రమే ఇంధనం నింపాలని ఈసీ స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఆయిల్ బంకుల లైసెన్స్లు రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు అన్ని బంకుల యజమానులకు నోటీసులు పంపింది. పోలింగ్ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో పలుచోట్ల హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.

కాగా రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత పల్నాడు, అనంతపురం, జమ్మలమడుగు తదితర ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి. టీడీపీ, వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు రాళ్లు, రాడ్డు, కర్రలు, కత్తులు, పెట్రోల్ బాంబులతో దాడుల చేసుకున్నారు. ఈ దాడుల్లో చాలా మంది గాయాలపాలయ్యారు. అయితే ఈ ఘటనలపై ఎన్నికల సంఘం సీరియస్‌గా స్పందించింది.పలువురు అధికారులను బదిలీ చేసింది. మరికొందరిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news