ఒక ప్రయోగం పేరుతో జపాన్ కి చెందిన బిలియనీర్ ఒకరు మన కరెన్సీలో 64 కోట్లను పంచి పెట్టారు. వివరాల్లోకి వెళితే మన ఆనందాన్ని డబ్బు ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందామని భావించిన ఆయన ఒక ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ ని రిట్వీట్ చేస్తే చాలు అన్నమాట. దీనితో ఆ ట్వీట్ ప్రపంచ వ్యాప్తంగా 41 లక్షల సార్లు రీట్వీట్ చేసారు ట్విట్టర్ యూజర్లు. ఆయన ఎవరో కాదు, జపాన్‌కు చెందిన ఫ్యాషన్ టైకూన్ యుసాకు మయిజావా
ప్రయోగం పూర్తయిన తర్వాత లాటరీ ద్వారా ఎంపిక చేసుకున్న వెయ్యి మందికి 100కోట్ల యెన్లను పంచుతామని ఆయన పేర్కొన్నారు. అంటే మన కరెన్సీలో దాదాపుగా 64 కోట్లు. దీనిపై స్పందించిన ఆయన, మనుషుల ఆనందాన్ని డబ్బు ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడమే తన పరిశోధన లక్ష్యమని చెప్పిన ఆయన, ఈ సొమ్ము గెలుపొందిన వారు దాన్ని తమకు నచ్చినట్లు ఖర్చు చేసుకోవచ్చని చెప్పారు.
అయితే ఆ తర్వాత ఓ చిన్న సర్వేలో పాలుపంచుకోవాలని చెప్పారు. డిసెంబరు 31న ఆయన ఈ ట్వీట్ చేయగా, జనవరి 7 వరకూ రీట్వీట్ చేసిన వారిలో వెయ్యి మందిని ఎంచుకుంటామని చెప్పారు. ప్రస్తుతం ఈ ట్వీట్ అంతర్జాతీయ స్థాయిలో వైరల్ గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా జనం ఉచితంగా వచ్చే డబ్బు కోసం చాలా వరకు ఎగబడ్డారు. ఈ ట్వీట్ కి వచ్చిన రీట్వీట్ లు చూస్తేనే అర్ధమవుతుంది.