జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని మార్పు ను వ్యతిరేకిస్తూ నేను విజయవాడలో నిర్వహించాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అయితే నిన్న రాత్రి చంద్రబాబు మరియు లోకేష్ ల ను పోలీసులు విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద అరెస్టు చేయడం.. పవన్ అప్పటికప్పుడే వెంటనే వారిని అరెస్టు ఖండించడం…. నేడు అమరావతిలో భారీ కవాతు ప్లాన్ చేయడం అన్నీ యాద్రుశ్చికమా? అన్నది ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరి ప్రశ్న.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసే ఉన్నారని మెజారిటీ ప్రజలు నమ్ముతున్న నేపథ్యంలో సరిగ్గా పక్క రోజే పవన్ కళ్యాణ్ ఇలాంటి చర్య చేపట్టడం అన్నది అతనికి ముప్పు అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇకపోతే మొన్న పవన్ కళ్యాణ్ అమరావతి రైతుల వద్దకు భరోసా ఇచ్చేందుకు వెళ్లగా అతనిని పోలీసులు ఆపితే అతను అడ్డుగా వేసిన కంచెలను దాటుకొని వెళ్లాల్సి వచ్చింది.
ఈ విషయం పైన కూడా చంద్రబాబు పవన్ ను తెగ సమర్థించే చేశాడు. మీరు జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా లేదా పవన్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారో తెలుసుకోలేనంత పిచ్చోళ్ళం కాదు అనుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కవాతు చేపట్టడం అన్నది భారీ నిర్ణయం అనే చెప్పాలి.