వైరల్ వీడియో: అనకొండ, బ్లాక్ పాంథర్ మధ్య రసవత్తర పోరాటం..

ప్రకృతిలో జరిగేవన్నీ బ్రతకడం కోసమే. మనం చేసే పనులు ఏవైనా మనల్ని మనం బతికించుకోవడం కోసమే. దానికోసం ఎన్నో యుద్ధాలు చేస్తుంటాం. మన ఉనికి కోసం ఎన్నో పోరాటాలు చేస్తుంటాం. ఆ పోరాటం ఇతర జంతువులతో కావచ్చు, మరో మనిషితో కావచ్చు. ఏదైనా కావచ్చు. తాజాగా ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ఒకానొక వీడియో బయటకి వచ్చింది. బ్రతుకు కోసం రెండూ జీవులు చేస్తున్న పోరాటం ఆ వీడియోలో కనిపించింది.

అమెరికా దేశంలో కనిపించిన ఈ పోరాటం అందరినీ ఆకర్షించింది. అమెరికాలో అత్యంత శక్తి వంతమైన బ్లాక్ పాంథర్, అనకొండల మధ్య జరిగిన యుద్ధం ఇది. పాముల జాతుల్లో అత్యంత పెద్దదైన అనకొండ, బ్లాక్ పాంథర్ ల మధ్య జరిగిన పోరాటం అందరికీ ఆసక్తి కలిగించింది. దాదాపు 130కిలోలకి పైగా బరువున్న అనకొండకి నీళ్ళలో బలం ఎక్కువగా ఉంటుందు. నేల మీద కన్నా నీళ్ళలో ఎక్కువ బలం ప్రదర్శిస్తుంది. అందుకే అవి నీటిమడుగుల్లో ఎక్కువగా కనిపిస్తాయి.

అలాగే బ్లాక్ పాంథర్ కి నేల మీద వేగం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇవి రెండూ కూడా పోరాటం చేస్తున్నప్పుడు తమ అధిక్యత కనబరిచే ప్రదేశంలోకి లాక్కెళ్ళాలని ప్రయత్నించాయి. బ్లాక్ పాంథర్, అనకొండని భూమి మీదకి తీసుకురావడానికి ప్రయత్నించగా, అనకొండ మాత్రం నీళ్ళలోకి తీసుకువెళ్ళాలని చూసింది. ఒకదానిని మించి మరొకటి పోటీ పడుతూ ఒకదానిపై మరొకటి ఆధిపత్యం చూపించాలని ప్రయత్నించాయి.

ఐతే ఈ వీడియో ఇప్పటికి కాదు. 2013లోనే వైరల్ అయ్యింది. కానీ మళ్ళీ ప్రస్తుతం ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న వీడియోని ఒకసారి మీరూ చూసేయండి.