వైరల్ వీడియో: కొండ చిలువల మధ్య సావాసం.. గంట ఉంటే..!

-

సహజంగా పాములంటే ప్రతి ఒక్కరికీ భయం. పాములను చూస్తేనే చాలు అక్కడి నుంచి లగెత్తుకుని పారిపోతుంటాం. పాముల్లో అతి పెద్దవి అనుకొండ. వీటిని చూస్తే చాలు ఆమడ దూరం పారిపోవాల్సిందే. కొండ చిలువలు మనిషి శరీరం కంటే పెద్ద వాటిని కూడా మింగగలవు. కొండ చిలువలను దూరం నుంచి చూస్తే చాలు ఎంతో భయపడతాం. అలాంటిది ఓ వ్యక్తి పాముల మధ్యలో ఉంటాడు. అతడిపై ఎన్నో కొండ చిలువల గుంప పడినా అదరడు.. బెదరడు..

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పదుల సంఖ్యలో ఉన్న అనకొండల మధ్య ఓ జంతు సంరక్షుడు కొండ చిలువల గురించి తెలుపుతూ ఉంటాడు. చుట్టూ భారీ కొండ చిలువలు, విభిన్న సైజులు, విభిన్న రంగుల్లో కనిపిస్తుంటాయి. వాటి మధ్యలో నిలబడి పర్యాటకులకు వాటి గురించి చెబుతూ ఉంటాడు. అంతా ప్రశాంతంగా కొనసాగుతుంటుంది. ఆయన ఎంతో ధైర్యంగా వాటి మధ్య ఉంటూ వాటితో ఆడుకున్నట్లూ కనిపిస్తుంది. ఇంతలో పాముల సమూహం పైనుంచి ఒక్కసారిగా అతడిపై పడతాయి. ఆ పాముల కింద అతడు పూర్తిగా కవర్ అయిపోతాడు. అది చూసిన వాళ్లు భయపడ్డారు కానీ, అతడు నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. ఎలాంటి భయం లేకుండా పాములతో ఆడుతూ ఉంటాదు.

ఇలాంటి భయంకరమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అక్వాలేడీ అనే ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ అయింది. దీనికి ‘’50 మిలియన్ల డాలర్ల కోసమైనా ఒక గంట ఉండగలరా..’’ ఉంటూ క్యాప్షన్ పెట్టింది. వీడియో చూసిన నెటిజన్లు పలు కామెంట్లు పెడుతూ.. లైక్ చేస్తున్నారు.

ఈ వీడియోపై నెటిజన్లు పలు కామెంట్లు పెడుతున్నారు. విషం లేని పాములని.. మేము కూర్చొగలమని, ఏ డాలర్ తీసుకోకుండానే నేను ఆ పని చేయగలను అని కొందరూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు.. ఇది నాకు పెద్ద విషయమే కాదని, ఒక్క సెకన్ కూడా ఉండలేను, అస్సలు ఉండను, కలలో వెళ్లి పాములతో ఉండి వస్తా.. అంటూ డిఫరెంట్‌గా కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news