రైతుల అందోళనలపై తెలంగాణ మంత్రి ఈటల వరుసగా ఎందుకు కామెంట్స్ చేస్తున్నారు.. మంత్రిగా ఉండొచ్చు.. ఉండకపోవచ్చు అంటూ పదే పదే ఎందుకంటున్నారు. అందోళనలు చేసే రైతులకు సంపూర్ణ మద్దతు అని స్వరం ఎందుకు పెంచుతున్నారు..ఈటల మాటల వెనుక ఆంతర్యం ఏంటి..ఇక ముందు కూడా ఇదే దూకుడుతో ఈటల ముందుకు సాగుతారా అన్నదాని పై గులాబీ పార్టీలో ఆసక్తికర చర్చ నడుస్తుంది.
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో సీనియర్ మంత్రి ఈటల రాజేందర్. తెలంగాణ ఉద్యమం నుంచి కేసిఆర్ వెంటే ఉన్నారు ఈటల. ఇటు పార్టీ … అటు ప్రభుత్వ అలోచనలకు అనుగుణంగా ఈటల మాట్లడాతారన్న అభిప్రాయం గులాబీనేతల్లో ఉంది. కానీ ఇటివలకాలంలో ఈటల రాజేందర్ ప్రధానంగా రైతుల విషయంలో మాట్లడుతున్న తీరు హట్ టాపిక్ అవుతుంది. జిల్లా పర్యటనలో ఉన్న ఈటల వరుసగా హట్ కామెంట్స్ చేస్తున్నారు. ఈటల మాటలు ఇటు పార్టీలో… అటు రాజకీయ వర్గాల్లో చర్చనీయశంగా మారాయి.
ఈ దేశంలో రైతు ఏడవద్దని నిర్ణయించుకుంటున్నం..నేను మంత్రిగా ఉండోచ్చు ఇంకోక దగ్గర ఉండవచ్చు..సమ్మెలు..అందోళనలు చేసే రైతులకు మాత్రం సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు మంత్రి ఈటల రాజేందర్. మాకు కొన్నిఇబ్బందులు ఉండవచ్చు కాని మాకు ఆత్మ అంటు ఉంటుంది అంటూ మనసులోని మాట బయటపెట్టారు రాజేందర్ . రైతులు..రైతు అందోళనలపై అదే వైఖరితో ముందుకు సాగుతున్నారు మంత్రి ఈటల.
తనకు సీఎం కేసీఆర్‌తో 20 ఏళ్ల అనుభందం ఉందని ఇన్నేళ్ల సంబంధంలో నాకు కేసిఆర్ పై అజమాయిషీ ఉంటుందన్నారాయన. రైతులు ఏమనుకుంటున్నారో చెప్పాల్సిన భాద్యత తనపై ఉందన్నారు రాజేందర్. వరుసగా మూడోరోజు కూడా ఈటల రైతుల పోరాటానికి మద్దతుగా మాట్లాడారు. కేంద్రానికి చేతులెత్తి దండంపెట్టి అడుగుతున్నా వెంటనే రైతు సమస్యలపై స్పందించాలన్నారు.
మొత్తంగా మంత్రి ఈటల రాజేందర్ చేస్తున్న కామెంట్స్ గులాబీపార్టీలో హట్ టాపిక్ అయ్యాయి. రైతుల అందోళనలపై అచితూచి నేతలు స్పందిస్తుంటే..ఈటల మాత్రం దూకుడుగా మాట్లాడుతున్నారు. మరి మంత్రిగారి మాటలకు కారణం ఏమై ఉంటుందని ఆరా తీసేపనిలో ఉన్నారు టీఆర్ఎస్ నేతలు.