వైరల్ వీడియో; రిషీ లాస్ట్ వీడియో నిజంగా అదేనా…?

-

ప్రముఖ నటుడు రిషి కపూర్ గురువారం ఉదయం 67 ఏళ్ళ వయసులో లుకేమియా క్యాన్సర్ తో మరణించిన సంగతి తెలిసిందే. ముంబై లో ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణించిన కొన్ని గంటల తరువాత, కపూర్ పక్కన ఒక వ్యక్తి పాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియోలో, రిషీ కపూర్ హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ఉంటాడు.

పక్కన ఉన్న ఒక యువకుడు ఆయన హిట్ సినిమా “దీవానా” నుండి “తేరే దర్డ్ సే దిల్ అబాద్ రాహా” అనే పాట పాడారు. తరువాత కపూర్ ఆ యువకుడ్ని ఆశీర్వదిస్తారు. ఆయన చివరి వీడియో ఇదే అంటూ పలువురు కామెంట్ చేసారు. అయితే ఈ వీడియో మూడు నెలల క్రితంది అని జాతీయ మీడియా గుర్తించింది. ఫిబ్రవరి మొదటి వారంలో కపూర్ ఢిల్లీలో సాకేత్ లోని మాక్స్ ఆస్పత్రిలో చేరినప్పుడు ఈ వీడియో షూట్ చేసారు.

ట్విట్టర్ యూజర్ “నాగ్మా” గురువారం వీడియోను షేర్ చేసారు. “గత రాత్రి క్లిప్ ను, ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రి వైద్యులతో పంచుకున్నారు. మీరు లెజెండ్ రిషిజి, మీరు ఎల్లప్పుడూ మా హృదయాల్లో మరియు మనస్సులో ఉంటారు ” అని పోస్ట్ చేసారు. జాతీయ మీడియా కూడా దీనిని విస్తృతంగా వైరల్ చేసింది. ఆ తర్వాత వీడియో మీద విచారణ చేయగా వీడియో లో పాట పాడుతున్న వ్యక్తి స్వెట్టర్ ధరించాడు.

అప్పటికే ముంబై లో 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. దీనిని ఫిబ్రవరి 3, 2020 న “ధీరాజ్ కుమార్ సాను” ద్వారా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసినట్లు గుర్తించారు. ఆయనతో సేల్ఫీ కూడా దిగాడు. ఫిబ్రవరి 4 న ఫేస్‌బుక్‌లో అదే దుస్తులలో ఈ పోస్ట్ కూడా చేసారు.జాతీయ మీడియా అతన్ని సంప్రదించగా రిషీ కపూర్ ని సాకేత్‌లోని మాక్స్ ఆసుపత్రిలో చేర్పించినప్పుడు వీడియోను షూట్ చేసినట్టు వివరించారు. అతను ఆస్పత్రిలో వార్డ్ బాయ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version