ఆశ్యర్యం.! అద్భుతంగా తెలుగు మాట్లాడిన అమెరికన్‌ – వైర‌ల్‌ వీడియో

313

తెలుగులో మాట్లాడే తెలుగువారే కరువైన ఈ రోజుల్లో, ఒక అమెరికన్‌, అద్భుతంగా తెలుగు మాట్లాడటం అక్కడ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఒక అమెరికావాసి స్వచ్ఛమైన తెలుగు ఉచ్చరించడం భారత్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఐజాక్‌ రిచర్డ్స్‌ అమెరికాలోని ఉటాలో నివసిస్తూఉంటాడు. అతనికి మోంటానాలో ఒక ఐస్‌క్రీమ్‌ షాప్‌ ఉంది. ఈ మధ్య తన షాప్‌కు వచ్చిన తెలుగు కస్లమర్లతో తెలుగులో మాట్లాడి షాక్‌ ఇచ్చాడు. గణేశ్‌ కేసన అనే ఎన్‌ఆర్‌ఐ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిని విడియోలో రిచర్డ్స్‌ వచ్చిన తెలుగువాళ్లతో తెలుగులో మాట్లాడటం అందరినీ ఆనందాశ్చర్యాలకు గురిచేసింది.

Viral video of american speaking fluent telugu

వాళ్ల నుండి ఆర్డర్‌ తీసుకుంటూ, ‘తెలుగులో చెప్పండి’ అనగానే ఒక్కసారిగా కేకలు పెట్టిన తెలుగువారు సంతోషం పట్టలేకపోయారు. గడగడా తెలుగు మాట్లాడుతున్న రిచర్డ్స్‌ను చూసి మాకు నోట మాట రాలేదని అందులో ఒకరు అన్నారు. 2.5 లక్షలకు పైగా వ్యూస్‌తో తెలుగువారందరినీ ఎంతో అలరించిందీ పోస్ట్‌. దీన్ని గమనించిన రిచర్డ్స్‌, తను తెలుగులో మాట్లాడుతూ ఇంకో పోస్ట్‌ కూడా పెట్టాడు.
రెండు సంవత్సరాలపాటు విశాఖ, విజయవాడ, హైదరాబాద్‌లలో తను పనిచేసినట్లు చెప్పుకొచ్చాడు రిచర్డ్స్‌. ‘ఆంధ్రపదేశ్‌, తెలంగాణలో అందరూ బాగున్నారా?’ అనే పలకరింపుతో మొదలుపెట్టిన ఆయన తనకు తెలుగంటే ఎంతో ఇష్టమని తెలిపాడు.

ఆమ్మానాన్నా అని కూడా పిలిపించుకోవాడానికి ఇష్టపడని తలిదండ్రులున్న ఈ కాలంలో తెలుగువాడు కాకపోయినా, ఎంతో మమకారంతో తెలుగు నేర్చుకుని, అందంగా మాట్లాడుతున్న ఐజాక్‌ రిచర్డ్స్‌ను చూసి బుద్ధి తెచ్చుకోవాల్సిన తెలుగువాళ్లు ఎంతోమంది ఉన్నారు. కాదంటారా.?