ఏదైనా చిన్న జంతువు కష్టాల్లో ఉంటే చాలు కాపాడటానికి కాస్త మనుషులు ప్రయత్నాలు చేయడం మనం సోషల్ మీడియాలో ఏదోక సందర్భంలో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. చాలా మంది సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తూ వస్తున్నారు. పాములు, పిల్లులు, కుక్కలు, ఏనుగులు, ఇలా రకరకాల జంతువులకు సంబంధించిన వీడియోలు ఈ మధ్య మనం చూస్తున్నాం.
ఒడిశాలోని భువనేశ్వర్ శివార్లలోని ఒక వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఆఫీసర్ సుసంతా నందా పోస్ట్ చేసారు. “భువనేశ్వర్ శివార్లలో ఎఫ్‌డి అధికారులు నిర్మించిన వంతెన నుండి ఒక పిల్లి పడిపోయిందని దానిని కాపాడమని చెప్తూ ఆయన ఒక వీడియో పోస్ట్ చేసారు. ఒక పిల్లి నీళ్ళల్లో పడగా దానిని అక్కడ ఉన్న ప్రజలు గమనించారు. వెంటనే సమాచారం ఇచ్చారు.
దీనితో గ్రామస్తులు అందరూ అక్కడికి చేరుకొని ఆ పిల్లి కోసం చేపలు పట్టే ఒక పరికరాన్ని నీళ్ళల్లోకి దింపారు. ముందు కంగారు పడినా సరే ఆ పిల్లి ఆ పరికరం మీదకు వచ్చింది. ఆ పిల్లి ఆ పరికరం మీదకు రాగానే పైకి లాగుతున్నారు, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. పిల్లి ప్రాణాలు కాపాడినందుకు గాను సోషల్ మీడియాలో ప్రజలకు ధన్యవాదాలు చెప్తున్నారు.
Rescue of a fishing cat from an under constructed bridge by FD officials on the outskirts of Bhubaneswar. Crowd making it stressful & difficult.
It has become rare. Gone are the days when I used to see the in plenty in our village. Curiosity of crowds is understandable?? pic.twitter.com/RFzfGn4uQC— Susanta Nanda IFS (@susantananda3) February 5, 2020