వైరల్ వీడియో; ఆ పక్షి అరుపు వింటే మైండ్ పోవడం ఖాయం…!

-

గత నాలుగు నెలల నుంచి ఆస్ట్రేలియాలో మంటలు అక్కడి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. దేశంలో అగ్ర భాగం మొత్తం మంటల్లోనే ఉండటంతో అక్కడి అధికారులకు ఇప్పుడు దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది. ఇప్పట్లో వర్షాలు కూడా పడే అవకాశం లేకపోవడంతో ఆ మంటలు అదుపులోకి వచ్చే సూచనలు కూడా కనపడటం లేదు. ఇప్పటికే ఈ మంటల ధాటికి 18 మంది మరణించినట్టు తెలుస్తుంది.

ఈ నేపధ్యంలో ఆస్ట్రేలియాలో ఒక పక్షి అరుపు అక్కడి ప్రజలను కంగారు పెడుతుంది. అచ్చు ఫైర్ ఇంజన్ లా అరుస్తుంది ఆ పక్షి. ఆస్ట్రేలియాలో మాగ్పీ పక్షి 90 శాతం ఫైర్ ఇంజిన్ లాగే కూత పెడుతూ కంగారు పెడుతుంది. అక్కడ మంటలను ఆర్పడానికి గాను పెద్ద సంఖ్యలో ఫైర్ ఇంజిన్లు పరుగులు పెడుతున్నాయి. అవి చేస్తున్న సైరన్‌లను ఈ మాగ్పీ పక్షి వినీ వినీ అలాగే అరుస్తుంది.

చివరకు తనకు పుటకతో వచ్చిన కూత మర్చిపోయి… ఫైరింజిన్ కూత చేస్తుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లక్షలాది లైకులతో, లక్షలాది వ్యూస్ తో దూసుకుపోతుంది. అయితే కొందరు ఈ పక్షి అరుపు విని చాలా బాగుంది అంటే మరికొందరు అది వార్నింగ్ ఇస్తుందని మంటల వ్యాప్తి గురించి ప్రజలను హెచ్చరిస్తుందని అంటున్నారు. పాపం ఆ మంటలు ఎప్పుడు ఆరతాయో అర్ధం కాక ఆ దేశ ప్రజలు బిక్కు బిక్కు మంటున్నారు.

Magpie-whistles-like-fire-truck

There have been so many emergency vehicles driving through bushfire-affected towns of New South Wales, it seems as though one magpie has picked up the tune.“This is one of the coolest things ever. Today I met an Australian magpie in Newcastle NSW which had learned to sing the calls of fire-engines and ambulances.” – Gregory Andrews.

Posted by Copacabana Rural Fire Brigade on Wednesday, 1 January 2020

Read more RELATED
Recommended to you

Latest news