ఐపీఎల్ 2023: RCB తరపున అరుదైన ఫీట్ సాధించిన “కింగ్” కోహ్లీ.. !

-

ఐపీఎల్ క్రికెట్ లీగ్ ఇప్పటి వరకు 15 సీజన్ లను సక్సెస్ ఫుల్ గా ముగించుకుని ఇప్పుడు 16వ సీజన్ ను జరుపుకుంటోంది. ఇప్పటికే సీజన్ స్టార్ట్ అయ్యి నాలుగు వారాలకు దగ్గర పడుతున్నా కొన్ని టీం లు ఇంకా తమదైన ఆటతీరును స్టార్ట్ చేయలేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం నిన్న జరిగిన రాజస్థాన్ మరియు బెంగుళూరు మ్యాచ్ లో బెంగుళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను సాధించాడు. RCB టీం చరిత్రలో ఎవ్వరికీ అందని రికార్డును అందుకుని చరిత్ర పుటల్లోకెక్కాడు. RCB తరపున విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 228 మ్యాచ్ లు ఆడగా నిన్న మ్యాచ్ లో అందుకున్న రెండు క్యాచ్ లతో కలుపుకుని 101 క్యాచ్ లను అందుకున్నాడు.

ఇక కోహ్లీ లాగా ఇతర టీం లలో ఎక్కువ క్యాచ్ లను అందుకున్న లిస్ట్ లో పోలార్డ్ 103 క్యాచ్ లతో మరియు సురేష్ రైనా 109 క్యాచ్ లతో ఉన్నారు. కాగా ఇంకా ఐపీఎల్ లో RCB కి 7 మ్యాచ్ లు మిగిలి ఉండగా క్యాచ్ ల సంఖ్య ఇంకా పెరిగి సురేష్ రైనాను దాటే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version