ఏపీలో వైరస్ వేరియంట్ల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. టీడీపీ, వైసీపీ మధ్య వైరస్ మాటలు ప్రకంపనలు రేపుతున్నాయి. ఏపీలో ఎన్ 440వైరస్ ఉందని, దీనిపై ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవట్లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఇక ఇదే మాటలపై అటు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
మంత్రి కొడాలి నాని ఒకడుగు ముందుకేసి ఏపీలో ఉంది నారా 420వైరస్ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నారావారి పల్లెలో 70ఏళ్ల క్రితం ఈ వైరస్ పుట్టిందని కామెంట్ చేశారు. దీంతో అటు టీడీపీ నేతలు ఈ వ్యాఖ్యలపై భగ్గుమంటున్నారు.
ఇదే విషయంపై చంద్రబాబు నాయుడు స్వస్థలగ్రామమైన కండులవారిపల్లె సర్పంచ్, ఉప సర్పంచ్ లు కలిసి మంత్రి కొడాలి నానిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఒక మంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని మండి పడ్డారు. అలాగే వైసీపీ మంత్రులు సిదిరి అప్పలరాజుపై కూడా టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఇక ఈ ఫిర్యాదుల రాజకీయాలు దేనికి దారి తీస్తాయో చూడాలి.