విశాఖ ఉక్కు ఆందోళనలపై కేంద్రం నిఘా.. న్యూఢిల్లీలో ఉద్రిక్తత

-

న్యూఢిల్లీ: విశాఖ ఉక్కు ఉద్యమ సెగ ఢిల్లీకి తాకింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి వ్యతిరేకిస్తోంది. విశాఖలో నిరసన వ్యక్తం చేసింది. కేంద్రప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఢిల్లీలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. జంతర్ మంతర్, ఆంధ్రా భవన్, పార్లమెంట్ స్ట్రీట్‌లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ధర్నాకు కాంగ్రెస్, టీడీపీ మద్దతు పలికింది.

ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి సభ్యులపై కేంద్రం నిఘా పెట్టింది. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. హోటల్‌లోనే వారిని బలవంతంగా నిర్బంధించేందుకు యత్నిస్తున్నారు. దీంతో పోలీసుల తీరుపై విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వారు బస చేస్తున్న హోటళ్ల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులతో తమను అడ్డుకోలేరని హెచ్చరించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రప్రభుత్వం దిగి వచ్చే వరకూ పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news