విశాల్‌ ‘లాఠీ’చార్జ్‌ షురూ.. ట్రైలర్‌ అదుర్స్‌

-

తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు విశాల్ గురించిన ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. తమిళ సినిమాల్లో సెటిలైన తెలుగు కుటుంబానికి చెందిన హీరో విశాల్‌. ఆయ‌న తాజా చిత్రం ‘లాఠీ’తో ప్రేక్ష‌కుల ముందుకు డిసెంబ‌ర్ 22న వ‌స్తున్నారు. అయితే.. ఎ.వినోద్ కుమార్ ద‌ర్శక‌త్వం వ‌హించిన‌ ఈ చిత్రం క్రిస్మస్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్‌డేట్‌లు ప్రకటిస్తూ సినిమాపై మంచి బజ్‌ క్రియేట్‌ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ రిలీజైంది.

Laththi - Official Telugu Trailer | Telugu Movie News - Times of India

లేటస్ట్‌గా రిలీజైన ట్రైలర్‌ ఆద్యాంతం ఆకట్టుకుంటుంది. హై ఓల్టేజ్‌ యాక్షన్‌ సీన్స్‌తో ట్రైలర్‌ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. విశాల్ ఈ చిత్రంలో కానిస్టేబుల్‌ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఆయనను డిపార్ట్‌మెంట్‌లో లాఠీ స్పెషలిస్ట్‌గా వర్ణించారు. యువన్‌ నేపథ్యం సంగీతం ఆకట్టుకుంటుంది. మీ లాంటి వాళ్ళను చేతికి లాఠీ ఇచ్చి కొట్టమంటే.. అది మాకు పై అధికారలిచ్చే ఆర్డర్‌ కాదురా..ఆఫర్‌ అంటూ విశాల్ డైలాగ్‌ సినిమాపై ఆసక్తి కలిగిస్తుంది. విశాల్‌, సునయన మధ్య కెమస్ట్రీ కూడా బాగానే వర్కవుట్‌ అయినట్లు ట్రైలర్‌ చూస్తే తెలుస్తుంది.

యాక్షన్ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను రానా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ర‌మ‌ణ, నంద సంయుక్తంగా నిర్మించారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్‌ కావాల్సింది. కానీ షూటింగ్‌ సమయంలో విశాల్ రెండు సార్లు మేజర్‌గా గాయపడటంతో చిత్రీకరణ ఆలస్యమవుతూ వచ్చింది. ఇక ఈ సినిమా తెలుగు, తమిళంతో పాటు హిందీ భాషలోనూ రిలీజ్‌ కానుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news