విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తున్న కారణంగా గంటా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశం మీద మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. గంటా రాజీనామా చీప్ ట్రిక్…పబ్లిసిటీ స్టంట్ అని ఆయన అన్నారు. గంటాకు చిత్తశుద్ధి ఉంటే స్పీకర్ ఫార్మాట్ లో ఎందుకు రాజీనామా చెయ్యలేదని అన్నారు.
నిత్యం పబ్లిసిటీ కోసం ప్రయత్నం చేసే వ్యక్తి ఎమ్మెల్యే గంటా అని ఆయన అన్నారు. నార్త్ నియోజకవర్గ ప్రజలు గంటా రాజీనామా ఆమోదిస్తే సంతోషిస్తారని ఆయన అన్నారు. 18 నెలలుగా గంటాను ఎవరూ గుర్తించడం లేదు….అందుకే కొత్త డ్రామా అని ఆయన అన్నారు. మళ్ళీ పోటీ చేసి గంటా గెలవ గలడా ? అని ప్రశ్నించిన అయన ప్రతి సారి నియోజకవర్గం మారే నేత గంటా అని అన్నారు. ఇక స్టీల్ ప్లాంట్ సమస్యను బీజేపీ పరిష్కరిస్తుందని ఆయన ఆశా భావం వ్యక్తం చేశారు.