హిట్ సీక్వెల్ నుండి విశ్వక్ ఔట్.. ?

ఫలక్ నుమా దాస్ సినిమాతో యువతలోక్రేజ్ తెచ్చుకున్న హీరో విశ్వక్సేన్, ఆ తర్వాత చేసిన హిట్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. థ్రిల్లర్ కథాంశంతో సాగిన ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందంటూ దర్శకుడు ప్రకటించాడూ. సీక్వెల్ లోనూ విశ్వక్ సేన్ హీరోగా కొనసాగుతాడని అన్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం హిట్ సీక్వెల్ నుండీ విశ్వక్ సేన్ తప్పుకున్నాడని అంటున్నారు.

అతని స్థానంలో అడవి శేష్ ని తీసుకోనున్నారట. ఇప్పటికే శైలేష్ కొలను, అడవి శేష్ మధ్య ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయట. ప్రస్తుతం హిందీ హిట్ రీమేక్ కోసం రెడీ అవుతున్న శేలేష్, హిట్ సీక్వెల్ కోసం స్క్రిప్టు సిద్ధం చేసే పనిలో ఉన్నాడట. హిందీ హిట్ రీమేక్ సిద్ధం అయ్యాక తెలుగు హిట్ సీక్వెల్ తెరకెక్కనుందని తెలుస్తుంది. ప్రస్తుతం అడవి శేష్, పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న మేజర్ సినిమాలో నటిస్తున్నాడు.